శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 23:11:56

భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు

భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు

హైదరాబాద్ : భాగ్యనగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్‌ను ఎయిర్‌పోర్టులో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు ఆహార సామగ్రిలో పేరుతో డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. కిలోకుపైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలతో కలిపి తీసుకునే మాదక ద్రవ్యంగా దీన్ని  గుర్తించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo