శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 13, 2020 , 07:13:03

హైద‌రా‌బాద్‌ శివా‌రులో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు

హైద‌రా‌బాద్‌ శివా‌రులో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు

హైద‌రా‌బాద్: రసా‌యన శాస్త్రంలో పీహె‌చ్‌డీ చేసిన ఓ వ్యక్తి.. తన విజ్ఞా‌నాన్ని పక్కదారి పట్టిం‌చాడు. డ్రగ్స్‌ తయా‌రు‌చేసి యువ‌తను మత్తుకు బాని‌సను చేసేందుకు ప్రయ‌త్నిస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటె‌లి‌జెన్స్‌ (డీ‌ఆ‌ర్‌ఐ) అధి‌కా‌రు‌లకు చిక్కాడు. యువ‌తను మత్తులో ముంచ‌డం‌తో‌పాటు మాన‌సిక వైక‌ల్యా‌నికి గురి‌చే‌య‌గ‌లిగే అత్యంత ప్రమా‌ద‌క‌ర‌మైన డ్రగ్‌ ‘మె‌ఫె‌డ్రో‌న్‌’ను హైద‌రా‌బాద్‌ శివా‌రులో తయా‌రు‌చే‌స్తు‌న్నట్టు అధి‌కా‌రులు గుర్తించారు. నిన్న దాదాపు నాలు‌గు‌చోట్ల దాడులు చేసి మొత్తం ఆరు‌గు‌రిని అరెస్ట్‌ చేశారు. 


డ్రగ్స్‌ తయారు చేస్తున్న ప్రధాన కేంద్రంలో 3.156 కిలోల మెఫె‌డ్రో‌న్‌ను సీజ్‌ చేశారు. దీని విలువ రూ.63.12 లక్షల ఉంటుందని అధి‌కా‌రులు చెప్పారు. దీంతో‌పాటు డ్రగ్‌ తయారు చేసేందుకు నిల్వ చేసిన 219.5 కిలోల ముడి పదా‌ర్థా‌లను స్వాధీనం చేసు‌కు‌న్నారు. వీటి సహాయంతో మరో 15–20 కిలోల మెఫె‌డ్రోన్‌ తయారు చేయ‌వ‌చ్చని అధి‌కా‌రులు తెలి‌పారు.

దీన్ని పీహె‌చ్‌డీ చేసిన ఓ వ్యక్తి నిర్వహి‌స్తు‌న్నా‌డని, అతడు గతంలో ఓ ఫార్మా సంస్థలో పని‌చే‌శా‌డని గుర్తించారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా 112 గ్రాముల మెఫె‌డ్రోన్‌, రూ.12.40 లక్షల నగదు లభ్యమ‌య్యాయి. అత‌డి‌తో‌పాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ డ్రగ్‌ రాకెట్‌ వెనుక ముంబై ముఠా హస్తం ఉన్నదని గుర్తిం‌చారు. నింది‌తుడు గత ఏడాది సుమారు 100 కిలోల మెఫె‌డ్రో‌న్‌ను తయారు చేసి విక్రయించి‌నట్టు అధి‌కా‌రులు పేర్కొ‌న్నారు. దీంతో‌పాటు మరో మూడు చోట్ల డీఆ‌ర్‌ఐ అధి‌కా‌రులు తని‌ఖీలు చేశా‌రని మరో నలు‌గు‌రిని అరెస్ట్‌ చేశా‌రని సమా‌చారం.


logo