బుధవారం 03 జూన్ 2020
Crime - Apr 08, 2020 , 22:37:55

వేటగాళ్ల ఉచ్చుకు చుక్కల దుప్పి హతం

వేటగాళ్ల ఉచ్చుకు చుక్కల దుప్పి హతం

మంచిర్యాల : కవ్వాల్‌ అభయారణ్యంలోని మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్‌ చింతగూడ బీట్‌ అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి చుక్కల దుప్పి మృత్యువాడపడింది. బుధవారం రేంజ్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌రావు అక్కడకు వెళ్లి దుప్పి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అడవిలో పూడ్చి వేయించారు. వన్యప్రాణుల వేటకు వెళ్లిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎఫ్‌డీఓ మాధవరావు తెలిపారు.


logo