శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 22:11:27

ప్రాణం తీసిన డోర్ క‌ర్టెన్

ప్రాణం తీసిన డోర్ క‌ర్టెన్

భోపాల్ : డోర్ కర్టెన్ ఆ చిన్నారి పాలిట మృత్యు పాశ‌మైంది. ప‌దేళ్ల బాలుడు డోర్ క‌ర్టెన్‌తో ఆడుతుండ‌గా మెడ‌కు చుట్టుకొని మ‌ర‌ణించిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ర్టం భోపాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. భోపాల్‌లోని భ‌వానీధ‌మ్ ఫేజ్‌-1లో నివాస‌ముంటున్న పంక‌జ్ శ‌ర్మ కుమారుడు హృతిక్ శ‌ర్మ‌(10) ఆగ‌స్టు 29న మ‌ధ్యాహ్న స‌మ‌యంలో డోర్ క‌ర్టెన్ (ప‌ర‌దా)ను చుట్టుకొని ఆడుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ప‌ర‌దా అత‌డి మెడ‌కు చుట్టుకోవ‌డంతో బాలుడి శ్వాస ఆగిపోయింది. 

గ‌మ‌నించిన త‌ల్లీ, సోద‌రి వెంట‌నే బాలుడిని ఇంద్రపురిలోని ఒక ప్రైవేట్ ద‌బాఖాన‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో త‌రువాత హ‌మీడియా ద‌వాఖానకు త‌ర‌లించ‌గా వెంటిలేట‌ర్ సాయంతో చికిత్స పొందుతూ 10 రోజుల త‌రువాత బుధ‌వారం రాత్రి మ‌ర‌ణించాడు. పదేండ్ల బాలుడు క‌ళ్ల‌ముందే మ‌ర‌ణించ‌డంతో త‌ల్లీదండ్రులు, కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo