శనివారం 11 జూలై 2020
Crime - May 11, 2020 , 18:05:48

ఆర్మీజవాన్‌ను మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు

ఆర్మీజవాన్‌ను మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌:  వ్యక్తిగత, వాహన రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరతీశారు. లోన్ వస్తుందన్న ఆశతో బాధితులు ఓటీపీ నెంబర్ చెప్పడం, సైబర్‌ నేరగాళ్లు పంపే అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తూ మోసపోతున్నారు.  

తాజాగా లోన్‌ పేరుతో ఓ ఆర్మీ జవాన్‌ను సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. రుణం ఇస్తామంటూ బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి మోసగాళ్లు ఫోన్‌ చేసి డబ్బులు దోచుకున్నారు. ప్రాసెసింగ్‌ చార్జీల పేరుతో ఏకంగా రూ.4.31లక్షలను సైబర్‌ ముఠా కొట్టేసింది. నేరగాళ్ల మాయ మాటలు నమ్మి వాళ్లు పంపిన బ్యాంక్‌ అకౌంట్‌లో జవాన్‌ డబ్బులు జమ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆర్మీ జవాన్‌ అశ్విన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


logo