ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 19:35:20

మైనర్‌ బాలికపై డాక్టర్‌ లైంగికదాడి

మైనర్‌ బాలికపై డాక్టర్‌ లైంగికదాడి

థానె : 14 ఏండ్ల మైనర్‌పై మెడికల్‌ ప్రాక్టిషనర్‌ క్లినిక్‌లోనే లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ర్టలోని థానే జిల్లా భివాండిలో చోటు చేసుకుంది. ఈ ఘటన జూలై 31న జరగ్గా శనివారం అతడిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు.. భివాండిలో క్లినిక్‌ నిర్వహిస్తున్న మెడికల్‌ ప్రాక్టిషనర్‌ జూలై 31(శుక్రవారం) రోగులను ఉదయం నుంచి పరీక్షిస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉండే ఓ 14 ఏండ్ల బాలికకు స్వల్ప జ్వరం రావడంతో ప్రాథమిక వైద్యం కోసం క్లినిక్‌కు వచ్చింది. బాలికపై కన్నేసిన కీచక డాక్టర్‌ క్లినిక్‌లో రోగులందరినీ పరీక్షించిన తరువాత సిబ్బందిని సాయంత్రం ఇంటికి పంపి, టెస్టుల పేరిట బాలికను తన వద్దే ఉండమని చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ మేరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీస్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo