బుధవారం 25 నవంబర్ 2020
Crime - Oct 25, 2020 , 09:48:48

బోల్తాపడ్డా డీజిల్‌ ట్యాంకర్‌..

బోల్తాపడ్డా డీజిల్‌ ట్యాంకర్‌..

హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీజిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ కార్లను తప్పించబోగా బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. కాగా బ్రేకులు ఫేయిల్‌ కావడంతోనే వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.