మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 21:35:05

బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌లేద‌ని.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌లేద‌ని.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌లేద‌ని మ‌న‌స్థాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా  రామ‌వ‌రం మండ‌లం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని తిలక్‌న‌గ‌ర్‌లో సోమ‌వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. తిల‌క్‌న‌గర్‌కు చెందిన మౌర్య నైనా(18) పుట్టిన‌రోజు కావ‌డంతో సోమ‌వారం స్నేహితుల‌తో పాటు ఇరుగు పొరుగువారు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. కానీ త‌న త‌ల్లి, సోద‌రుడు మాత్రం ఆమెకు విష్ చేయ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన నైనా అదేరోజు మ‌ధ్యాహ్నం “నా పుట్టిన‌రోజు ఇంట్లోవాళ్ల‌కు కూడా గుర్తు లేదు, జీవి‌తం మీద విర‌క్తి పుడుతోంది‌” అ‌ని సూసైడ్‌నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

అయితే చెల్లికి చెప్ప‌కుండా సాయంత్రం పుట్టిన‌రోజు వేడుక‌ను ఘ‌నంగా జ‌రిపి ఆమెను స‌ర్‌ప్రైజ్ చేద్దామ‌నుకున్నాన‌ని నైనా సోద‌రుడు, త‌ల్లి రోధిస్తున్న తీరు స్థానికుల‌ను కంటత‌డి పెట్టించింది. నైనా తండ్రి చిన్న‌త‌నంలోనే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో త‌ల్లి టైల‌ర్ ప‌ని చేసుకుంటూ పిల్ల‌ల‌ను చ‌దివిస్తోంది. పుట్టిన‌రోజు నాడే బాలిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంతో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న కొత్త‌గూడెం టూటౌన్ ఎస్‌ఐ బ‌త్తుల స‌త్య‌నారాయ‌ణ కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని మంగ‌ళ‌వారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo