గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 02, 2020 , 16:56:25

చెల్లి చావుకు కార‌ణ‌మైనొన్ని తీహార్ జైల్లో మ‌ట్టుబెట్టాడు..

చెల్లి చావుకు కార‌ణ‌మైనొన్ని తీహార్ జైల్లో మ‌ట్టుబెట్టాడు..

న్యూఢిల్లీ : త‌న చెల్లి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన ఓ నిందితుడిని.. అంత‌మొందించాడు. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. నిందితుడిని హ‌త్య చేసి.. ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. ఈ ఘ‌ట‌న తీహార్ జైల్లో జూన్ 29న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వ‌సీం(24) అనే యువ‌కుడికి ఓ సోద‌రి ఉంది. ఆమె మైన‌ర్. అయితే గ‌త కొద్ది రోజుల క్రితం.. మెహ‌త‌బ్(28) అనే యువ‌కుడు.. ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ త‌ర్వాత కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టి.. నిందితుడు మెహ‌త‌బ్ ను తీహార్ జైలుకు త‌ర‌లించారు.

ఇక వ‌సీం కూడా ఓ హ‌త్య కేసులో నిందితుడు. ఇత‌న్ని కూడా తీహార్ జైలుకే త‌ర‌లించారు. కానీ వ‌సీం జైలు నంబ‌ర్ 5లో ఉండ‌గా, మెహ‌త‌బ్ జైలు నంబ‌ర్ -8లో ఉంటున్నారు. మొత్తానికి త‌న చెల్లి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన మెహ‌త‌బ్ ను మ‌ట్టుబెట్టాల‌ని వ‌సీం నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌ణాళిక ర‌చించాడు. జైలు నంబర్ -5లో ఉన్న ఖైదీలతో వ‌సీం గొడ‌వ‌లు పెట్టుకునేవాడు. దీంతో అత‌న్ని జైలు నంబ‌ర్ -8కు త‌ర‌లించారు. కొద్ది రోజుల త‌ర్వాత మెహ‌త‌బ్ పై దాడి చేసి చంపాడు వ‌సీం. పోలీసుల విచార‌ణ‌లో చేసిన నేరాన్ని వ‌సీం అంగీక‌రించాడు.  హ‌రిన‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo