జగిత్యాల : మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ ఉప సర్పంచ్ ఓలేపు ప్రదీప్ గౌడ్(28) గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి డెడ్‌బాడీని తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఉప సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.