ముంబై : థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడాది కిందట మున్సిపల్ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిపై బాధిత నర్సు ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో దవాఖానలో కరోనా వైరస్ సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షకుడిగా ఉన్న డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేల్కర్ ఆమెపై అసభ్య కామెంట్లు చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడు.
అధికారి తీరుపై బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగంలో చేరే సమయంలో తాను సమర్పించిన డాక్యుమెంట్లు సరిగా లేవంటూ తనపై వేటు వేశారని ఆమె పేర్కొన్నారు. ఆపై న్యాయం కోసం ఆమె విషాఖ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర వాఘ్‌ను కలిశారు. దీంతో నర్సు పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన డాక్టర్ కేల్కర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.