మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 18:15:56

చికెన్ లేద‌న్నందుకు దాబాను త‌గుల‌బెట్టిన తాగుబోతులు..!

చికెన్ లేద‌న్నందుకు దాబాను త‌గుల‌బెట్టిన తాగుబోతులు..!

నాగ్‌పూర్‌: చికెన్‌ అడిగితే దాబా యజమాని లేదన్నానే కోపంతో ఇద్ద‌రు తాగుబోతులు అత‌ని దాబానే త‌గుల‌బెట్టారు. మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ న‌గరంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. పోలీసులు వెల్ల‌డించిన‌ వివరాల ప్రకారం.. శంకర్‌ తైదే, సాగర్ పటేల్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ఆదివారం అర్ధ‌రాత్రి ఒంటిగంట సమయంలో నాగ్‌పూర్‌లోని బెల్‌ట్రోడీ ఏరియాలోగ‌ల ఓ దాబాకు వెళ్లారు. అప్ప‌టికే పూటుగా మ‌ద్యం సేవించి ఉన్న ఆ ఇద్ద‌రూ దాబా య‌జ‌మానిని పిలిచి చికెన్‌ ఆర్డర్‌ చేశారు. 

అయితే, అప్ప‌టికే దాబాలో చికెన్ అయిపోవ‌డంతో అదే విష‌యాన్ని దాబా య‌జ‌మాని వారికి చెప్పాడు. దాంతో తాము ఆర్డర్ చేస్తే చికెన్ లేద‌ని చెబుతావా అంటూ ఇద్ద‌రు తాగుబోతులు అత‌నితో వాగ్వాదానికి దిగారు. అంత‌టితో ఆగ‌క ఏకంగా అత‌ని దాబాకు నిప్పుపెట్టారు. దాంతో దాబా కాలి బూడిద‌య్యింది. దాబా య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి ఇద్ద‌రినీ అద‌పులోకి తీసుకున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.