మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 22:18:59

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధులు

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధులు

పెద్దపల్లి : జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్‌ గ్రామంలో పేకాటాడుతున్న ప్రజాప్రతినిధులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్‌ వైస్‌ ఎంపీపీ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న  సమాచారం పోలీసులకు   అందింది.

రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు  టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ , ఎస్సై షేక్‌ మస్తాన్‌, సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై  దాడులు నిర్వహించారు. మొత్తం 11 మంది   పేకాట ఆడుతున్నవారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1,41,660 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ సర్పంచ్‌తో పాటు సింగిల్‌విండో చైర్మన్‌ , వైస్ ఎంపీపీ భర్త పోలీసులకు పట్టుబడ్డ వారిలో ఉన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo