శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 07:17:05

ఇద్దరు నకిలీ రైల్వే అధికారులు అరెస్టు

ఇద్దరు నకిలీ రైల్వే అధికారులు అరెస్టు

న్యూఢిలీ : ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నకిలీ రైల్వే అధికారులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్‌లో పరిసరాల్లో పోలీసులు భద్రత పెంచారు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల టికెట్లు, సిబ్బంది గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఎక్కేందుకు వచ్చిన ఇద్దరు తమను తాము రైల్వే అధికారులుగా పోలీసులకు పరిచయం చేసుకున్నారు.

వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ అధికారులని  నిర్ధారణ అయ్యింది. వీరులో మార్తాండ్ రుబాబ్ కాంబ్లే (21) అనే యువకుడు గతంలో రైల్వే సైబర్ కేఫ్‌లో పనిచేశాడు. రైళ్లలో దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకే నిందితులు నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి  రైల్వే ఉద్యోగులుగా చలామణి అవుతున్నట్లు డీసీపీ రైల్వే హరీందర్ సింగ్ తెలిపారు. నిందితుల్లో మరొకరిని ఓంకర్ బైరాగి వాగ్మోడ్(20)గా గుర్తించారు. వీరిద్దరు ఒకప్పుడు దాయాదులని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


logo