బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 25, 2020 , 08:37:19

దుకాణాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

దుకాణాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు వెంట ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. వజిరాబాద్‌ ప్రధాన రహదారిపై నంద్‌నగరి డిపో ఎదుట జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo