ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 05, 2020 , 11:50:37

16 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆడ‌శిశువుకు జ‌న్మ‌

16 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆడ‌శిశువుకు జ‌న్మ‌

న్యూఢిల్లీ : ఓ 16 ఏళ్ల బాలిక‌పై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గ‌ర్భం దాల్చింది. అక్టోబ‌ర్ 31న ఆడ‌శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో తొమ్మిది నెల‌ల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

నార్త్ ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక త‌న త‌ల్లితో క‌లిసి జీవిస్తోంది. ఇద్ద‌రూ ప‌ని మ‌న‌షులుగా కొన‌సాగుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ బాలిక‌కు త‌న ఇంటికి స‌మీపంలో ఉన్న ఓ షాప్ కీపర్‌(60) ప‌రిచ‌యం అయ్యాడు. ఈ క్ర‌మంలో తొమ్మిది నెల‌ల క్రితం బాలిక‌పై షాప్ కీప‌ర్‌ అత్యాచారం చేశాడు. మొత్తానికి బాధితురాలు గ‌ర్భం దాల్చింది. అయితే ఈ ఏడాది అక్టోబ‌ర్ 31న ఆమె ఆడ‌శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఆ త‌ర్వాత బిడ్డ‌ను బ‌ట్ట‌లో చుట్టి.. స్థానికంగా ఉన్న ఓ షాపు వ‌ద్ద విడిచిపెట్టి వెళ్లింది. 

శిశువును గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు శిశువును స్వాధీనం చేసుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించి.. శిశువును వ‌దిలిపెట్టి వెళ్లిన బాలిక‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

ఆ బాలిక‌ను పోలీసులు విచారించ‌గా.. తొమ్మిది నెల‌ల క్రితం షాప్ కీప‌ర్ త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని, ఆ త‌ర్వాత గ‌ర్భం దాల్చిన‌ట్లు బాధితురాలు చెప్పింది. దీంతో షాప్ కీప‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. 


logo