గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 26, 2020 , 16:36:18

మహిళలను వేధిస్తున్న ఎస్‌ఐ అరెస్ట్‌

మహిళలను వేధిస్తున్న ఎస్‌ఐ అరెస్ట్‌

న్యూఢిల్లీ: మహిళలను వేధిస్తున్న ఒక ఎస్‌ఐ అరెస్టయ్యాడు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఒక వ్యక్తి పలువురు మహిళలను వేధించాడు. మహిళలు, బాలికలపై కారు లైట్లు వేయడం, వారి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ నెల 17 నుంచి 20 వరకు ద్వారకా ప్రాంత పోలీస్‌ స్టేషన్‌కు పలువురు బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి నెంబర్‌ ప్లేట్‌ లేని కారులో తిరుగుతూ మహిళలు, బాలికల పట్ల అభ్యంతరకరమైన హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వినియోగిస్తున్న కారును గుర్తించారు. ఆ కారు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా నిందితుడ్ని ఎస్‌ఐ పునీత్ గరేవాల్‌గా గుర్తించారు. జనక్‌పురిలో నివాసం ఉంటున్న అతడ్ని శనివారం అరెస్ట్‌ చేశారు. పునీత్‌పై 354డీ,354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆయన గతంలో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ యూనిట్‌తోపాటు పలు విభాగాల్లో పని చేసినట్లు వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.