గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 07, 2020 , 19:43:22

ఢిల్లీలో ఇద్దరు షార్ప్‌ షూటర్లు అరెస్టు

ఢిల్లీలో ఇద్దరు షార్ప్‌ షూటర్లు అరెస్టు

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రసిద్ధ సునీల్‌ రతి గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ షూటర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరిపై ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌నగర్‌ జిల్లా బుద్ధాన పోలీస్‌ స్టేషన్‌లో హత్య కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కొక్కరిపై రూ. 25 వేల వరకు రివార్డు ఉందని వెల్లడించారు. పలు కేసుల్లో నిందితులైన వీరు పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టి ఇవాళ మధ్యాహ్నం చాకచక్యంగా పట్టుకున్నట్లు వివరించారు.  


logo