బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 15:40:35

పిస్తోల్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

పిస్తోల్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. త‌న స‌ర్వీస్ పిస్తోల్‌తో కాల్చుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ద‌క్షిణ ఢిల్లీలోని లాడో స‌రాయ్ ఏరియాలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సంజ‌య్.. ఢిల్లీలోని సాకేత్ పోలీస్‌స్టేష‌న్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉన్న‌ట్టుండి సంజ‌య్‌ త‌న స‌ర్వీస్ పిస్తోల్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. 

అయితే, సంజ‌య్ ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలు ఏమిటో తెలియాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. మృత‌దేహం ద‌గ్గ‌ర ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేద‌ని చెప్పారు. అయితే, సంజయ్ అన్న‌కు గ‌త కొంతకాలంగా ఆరోగ్యం బాగుండ‌టంలేద‌ని, ఎప్పుడూ సోద‌రుడి ఆనారోగ్యం గురించి చెబుతూ బాధ‌ప‌డేవాడ‌ని, ఆ ఒత్త‌డివ‌ల్లే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు త‌మ‌ ప్రాథ‌మిక విచార‌ణలో అంచ‌నా వేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo