మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 13:46:36

ఢిల్లీలో బాలికను లైంగికంగా వేధించిన నిందితుడు అరెస్ట్‌

ఢిల్లీలో బాలికను లైంగికంగా వేధించిన నిందితుడు అరెస్ట్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 12 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించడంతోపాటు దాడికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పశ్చిమ విహార్‌ ప్రాంతంలో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఢిల్లీ ఎయిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నది. సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌ గురువారం ఎయిమ్స్‌ దవాఖానకు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. బాలిక కుటుంబానికి రూ.10 లక్షల ప్రభుత్వ సహాయాన్ని ప్రకటించారు. ఈ దారుణంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అనంతరం మీడియాతో కేజ్రీవాల్‌ చెప్పారు. మరోవైపు దేశ రాజధానిలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గురువారం ఎయిమ్స్‌ దవాఖాన వద్ద నిరసన తెలిసారు. ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


logo