శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 14:21:44

ఈడీ అధికారుల పేరుతో వ్యాపారులను మోసగించిన ఐదుగురి అరెస్ట్

ఈడీ అధికారుల పేరుతో వ్యాపారులను మోసగించిన ఐదుగురి అరెస్ట్

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల పేరుతో వ్యాపారులతోపాటు కొందరు వ్యక్తులను మోసగించి దోచుకున్న ఐదుగురు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీకి చెందిన ఐదుగురు వ్యక్తులు నకిలీ ఈడీ అధికారుల అవతారం ఎత్తారు. వ్యాపారులతో పాటు కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని బెదిరించి వారి నుంచి డబ్బులు దండుకున్నారు. ఇలా పలువురిని మోసగించిన వీరి గురించి పోలీసులకు తెలిసింది. దీంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెట్టి ఈ ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ఐదుగురిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈడీ అధికారుల పేరుతో వారు పాల్పడిన మోసాలు, చేసిన దోపిడీలపై దర్యాప్తు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo