సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 12:58:07

వ్య‌క్తిని కాల్చిచంపిన పోలీస్ కానిస్టేబుల్‌

వ్య‌క్తిని కాల్చిచంపిన పోలీస్ కానిస్టేబుల్‌

ఢిల్లీ : ఓ వ్య‌క్తిని పోలీస్ కానిస్టేబుల్ కాల్చి చంపాడు. ఈ సంఘ‌ట‌న దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోని రితాలా ప్రాంతంలో ఈ ఉద‌యం 6 గంట‌ల‌కు చోటుచేసుకుంది. కాల్పులు జ‌రిపిన కానిస్టేబుల్ సురేంద్ర‌(47)ను పోలీసులు అరెస్టు చేశారు. మృతిచెందిన వ్య‌క్తిని దీప‌క్‌గా గుర్తించారు. ద్వార‌కా నివాసియైన ఇత‌ను ఓ జిమ్ సెంట‌ర్‌ను న‌డుపుతున్నాడు. కానిస్టేబుల్ కాల్పులకు పాల్ప‌డ్డ కార‌ణం ఇంకా తెలియ‌లేదు. విచార‌ణ కొన‌సాగుతుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.


logo