శనివారం 23 జనవరి 2021
Crime - Dec 29, 2020 , 10:25:46

పార్టీకి డ‌బ్బులివ్వ‌లేద‌ని నాన‌మ్మ‌ను చంపేశాడు..

పార్టీకి డ‌బ్బులివ్వ‌లేద‌ని నాన‌మ్మ‌ను చంపేశాడు..

న్యూఢిల్లీ : న‌్యూఇయ‌ర్ వేడుక‌లు చేసుకునేందుకు డ‌బ్బులివ్వ‌లేద‌ని ఓ యువ‌కుడు త‌న నాన‌మ్మ‌ను హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఢిల్లీలోని షాహాద‌రాలో శ‌నివారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 73 ఏళ్ల బామ్మ‌కు సంజ‌య్ అనే కుమారుడు ఉన్నాడు. సంజ‌య్‌కు క‌ర‌ణ్‌(19), మ‌నోజ్ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. బామ్మ గ్రౌండ్ ఫ్లోర్‌లో నివ‌సిస్తుండ‌గా, ఆమె కుమారుడు మొద‌టి అంత‌స్తులో ఉంటున్నాడు. 


అయితే న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకునేందుకు డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని శ‌నివారం రాత్రి నాన‌మ్మ‌ను క‌ర‌ణ్ అడిగాడు. డ‌బ్బులు ఇచ్చేందుకు బామ్మ నిరాక‌రించ‌డంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి ఆమె త‌ల‌పై సుత్తితో బాది.. ఇంట్లో ఉన్న రూ. 18 వేలు దొంగిలించాడు. ముస‌లావిడ చ‌నిపోయింది. ఆదివారం ఉద‌యం పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్క‌డున్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ద‌ర్యాప్తు చేసి నిందితుడిని ప‌ట్టుకున్నారు. క‌ర‌ణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   


logo