శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 12, 2020 , 15:22:26

గొడవ సర్దిచెప్పబోయిన వ్యక్తిని కత్తితో 22 సార్లు పొడిచి హత్య

గొడవ సర్దిచెప్పబోయిన వ్యక్తిని కత్తితో 22 సార్లు పొడిచి హత్య

న్యూఢిల్లీ: గొడవ పడుతున్న వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కత్తితో 22 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. దేశ రాజదాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సఫ్దర్‌జంగ్ దవాఖానలో నీరజ్‌ అతడి స్నేహితులు ముఖేష్‌, రాకేష్‌ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కాగా కృష్ణ, రవి అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డుల స్థానంలో ముఖేష్‌, రాకేష్‌ను నియమించారు. దీంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. బుధవారం రాత్రి విధుల అనంతరం నీరజ్‌, ముకేష్‌, రాకేష్‌ తమ ఇండ్లకు వెళ్తుండగా మార్గమధ్యలో కాపుకాసిన  కృష్ణ, రవితో పాటు మరో మైనర్‌ బాలుడు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది. ఆ ముగ్గురు ముఖేష్‌, రాకేష్‌పై దాడి చేయగా సర్ది చెప్పేందుకు నీరజ్‌ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ముగ్గురు నీరజ్‌ను కత్తితో 22 సార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కృష్ణ, రవిని అరెస్ట్‌ చేశామని, మైనర్‌ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.