బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 12, 2020 , 10:44:43

గొడ‌వ మ‌ధ్య‌లో వెళ్లినందుకు 22 క‌త్తిపోట్లు

గొడ‌వ మ‌ధ్య‌లో వెళ్లినందుకు 22 క‌త్తిపోట్లు

న్యూఢిల్లీ : ఓ న‌లుగురి మ‌ధ్య చోటు చేసుకున్న గొడ‌వ‌లో క‌ల్పించుకున్న పాపానికి ఓ యువ‌కుడు బ‌ల‌య్యాడు. ఆ యువ‌కుడు 22 క‌త్తిపోట్ల‌కు గురై ప్రాణాలు విడిచాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని స‌ఫ్దార్‌గంజ్ హాస్పిటల్ స‌మీపంలో బుధ‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ముఖేష్‌, రాకేశ్‌, నీర‌జ్ అనే ముగ్గురు యువ‌కులు స‌ఫ్దార్‌జంగ్ ఆస్ప‌త్రిలో సెక్యూరిటీ గార్డులుగా ప‌ని చేస్తున్నారు. అయితే ముఖేష్, రాకేశ్ స్థానంలో కృష‌ణ్‌, ర‌వి అనే యువ‌కుల‌ను తీసుకున్నారు. దీంతో బుధ‌వారం రాత్రి ముఖేష్‌, రాకేశ్‌, కృష‌ణ్‌, ర‌వి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ న‌లుగురిని నీర‌జ్ స‌ముదాయిస్తున్న క్ర‌మంలో కృష‌ణ్‌, ర‌వి క‌లిసి అత‌నిపై క‌త్తితో దాడి చేశారు. ఒక‌ట్రెండు సార్లు కాదు.. ఏకంగా 22 సార్లు నీర‌జ్‌పై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డారు. ముఖేష్‌, రాకేశ్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. నీర‌జ్ ప్రాణాలు కోల్పోగా, మిగ‌తా ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కృష‌ణ్‌, ర‌విని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


logo