కాలనీలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న యువకుడి హత్య

న్యూఢిల్లీ: కాలనీలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఒక యువకుడ్ని కత్తితో పొడిచి హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టైగ్రి ఎక్స్టెన్షన్ కాలనీలో నివాసం ఉండే వివేక్ అలియాస్ విక్కి (19)ని అతడి స్నేహితుడు పియూష్ అలియాస్ బిట్టు కలిసేందుకు అక్కడికి వస్తుండేవాడు. అయితే అదే కాలనీకి చెందిన సతీశ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. బయట వ్యక్తులను కాలనీలోకి రానీవ్వవద్దని వివేక్‌కు చెప్పాడు. ఈ విషయమై వీరి మధ్య వివాదం నెలకొన్నది. దీంతో సతీశ్‌కు గుణపాఠం చెప్పాలని వివేక్, పియూష్ నిర్ణయించారు. దీంతో పియూష్ ఒక కత్తిని తెచ్చి వివేక్‌కు ఇచ్చాడు. మంగళవారం రాత్రి కాలనీ బయట సతీశ్ ఉండటాన్ని పియూష్ చూశాడు. కత్తిని తీసుకు రమ్మని వివేక్‌కు చెప్పాడు. అనంతరం వారిద్దరు సతీశ్‌తో ఘర్షణకు దిగారు.
దీనిని గమనించిన కాలనీకి చెందిన వ్యక్తి వారికి సర్దిచెప్పకపోగా అంతలోనే సతీశ్‌ను కత్తితో పొడిచారు. వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే ఈ సతీశ్‌పై కత్తితో దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు ఆ కాలనీకి చెందిన వివేక్‌ను అరెస్ట్ చేశారు. అతడి స్నేహితుడు పియూష్ కోసం గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.