బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 13:18:38

రూ.20 కోసం గొడవ.. వ్యక్తిని కొట్టిచంపిన అన్నదమ్ములు

రూ.20 కోసం గొడవ.. వ్యక్తిని కొట్టిచంపిన అన్నదమ్ములు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. రూ.20 కోసం అన్నదమ్ములు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హతమార్చారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బురారి ప్రాంతానికి చెందిన రూపేశ్‌ అనే వ్యక్తి క్షవరం చేయించుకునేందుకు సమీపంలోని కటింగ్‌ షాపునకు వెళ్లాడు. క్షవరం చేసిన సంతోశ్‌ అనే వ్యక్తి రూ.50 ఇవ్వమనడంతో తన వద్ద రూ.30 మాత్రమే ఉన్నాయని రూపేశ్‌ అన్నాడు.

దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన సంతోశ్‌ తన సోదరుడు సరోజ్‌తో కలిసి అతడిని కట్టెలతో విచక్షణారహితంగా కొట్టాడు. అపస్మారక స్థితికి చేరిన రూపేశ్‌ను స్థానికులు సమీపంలోని హాస్పటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబీకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo