సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 16, 2020 , 16:14:17

సుశాంత్‌ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

సుశాంత్‌ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసులో తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఢిల్లీకి చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యాయవాదిగా చెబుతున్న అతడ్ని ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. విభోర్ ఆనంద్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో సుశాంత్‌, ఆయన మాజీ మేనేజర్‌ దిశా శాలిని మరణాలపై వివాదస్పద ఆరోపణలు చేశాడు. పలువురు వ్యక్తుల లక్ష్యంగా కంట్రోవర్సీ పోస్టులు పెట్టాడు. ముంబై పోలీసుల దర్యాప్తుపైనా విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను విభోర్‌ ఖాతాను ట్విట్టర్‌ సస్పెండ్‌ చేసింది.

మరోవైపు విభోర్‌ చేసిన ఆరోపణలు, సుశాంత్‌ కేసును తప్పుదారి పట్టించేందుకు అతడు చేసిన ప్రయత్నాలను సీరియస్‌గా పరిగణించిన ముంబై పోలీసులు ఢిల్లీ వెళ్లి అతడ్ని అరెస్ట్‌ చేశారు. ముంబైకి తీసుకువచ్చి అతడు చేసిన తప్పుడు ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతోపాటు ఒక మహిళ గురించి తప్పుగా వీడియోలు పోస్ట్‌ చేసిన మోడల్‌, యూట్యూబర్‌ ప్రదీప్ మొహిందర్ సింగ్ చౌదరిని గత నెలలో ఆమె ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo