సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 19:19:02

మ్యాట్రిమోనియల్‌ సైట్ల వేదికగా యువతులకు గాలం!

మ్యాట్రిమోనియల్‌ సైట్ల వేదికగా యువతులకు గాలం!

న్యూ ఢిల్లీ: పేర్లు, చిరునామా మారుస్తూ మ్యాట్రిమోనియల్‌ సైట్ల వేదికగా యువతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా, ఓ యువతి వద్ద పెళ్లిపేరుతో రూ. 17 లక్షలు కొట్టేయగా, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  

వాయువ్య ఢిల్లీ డీసీపీ విజయాంత ఆర్య తెలిపిన వివరాల ప్రకారం. ముదిత్ చావ్లా అనే వ్యక్తి తన పేరు, చిరునామా మార్చుకుంటూ మ్యాట్రిమోనియల్‌ సైట్లలో వివరాలు నమోదు చేసుకుంటాడు. యువతులు సంప్రదించగానే, వారి దగ్గర కట్నంగా డబ్బులు తీసుకొని, మోసం చేస్తాడు. అయితే, ఇటీవల షాదీ.కామ్‌లో ఓ యువతి పరిచయం అయింది. ఆమెతో స్నేహంగా ఉండి, రూ.17 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వలపన్ని అతడిని పట్టుకున్నారు. ఇదివరకే అతడిపై ఇలాంటి నాలుగు కేసులున్నట్లు గుర్తించామని డీసీపీ ఆర్య పేర్కొన్నారు. అతడి వద్ద వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo