శనివారం 23 జనవరి 2021
Crime - Oct 02, 2020 , 18:01:11

ఆర్మీ సిబ్బందిగా చెప్పుకుంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఆర్మీ సిబ్బందిగా చెప్పుకుంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

న్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన సిబ్బందిగా పేర్కొంటూ పలువురిని మోసగిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన సునీల్ కుమార్ దుబే ఆర్మీకి చెందిన వ్యక్తిగా అవతారమెత్తాడు. ఆర్మీ డ్రెస్ వేసుకుని సహాయం పేరుతో బహిరంగ ప్రదేశాల్లో పలువురిని మోసగించసాగాడు. ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించేవారికి సహాయం చేస్తానని నమ్మించి వారిని మోసం చేసేవాడు. వీటిపై ఫిర్యాదులు రావడంతో ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌ పోలీస్ స్టేషన్ సిబ్బంది సునీల్ కుమార్ దుబేను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న నకిలీ ఆర్మీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అతడి మోసాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo