బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 08:47:22

కుళ్లిపోయిన స్థితిలో ఎయిమ్స్‌ వైద్యుడి మృతదేహం

కుళ్లిపోయిన స్థితిలో ఎయిమ్స్‌ వైద్యుడి మృతదేహం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఎయిమ్స్‌ దవాఖాన వైద్యుడు డాక్టర్‌ మోహిత్‌ సింఘ్లా (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఈ విషయం వెల్లడైంది.‘గౌతంనగర్‌లోని ఓ ఇంటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ వచ్చింది. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో ఉరితాడుకు వేలాడుతున్న మృతదేహం కనిపించింది. అది కుళ్లిపోయిన స్థితిలో ఉంది’ అని ఢిల్లీ పోలీస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించామని పేర్కొంది.logo