శనివారం 24 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 15:11:24

ల‌వ‌ర్‌పై కాల్పులు జ‌రిపి.. మామ‌ను చంపేసిన ఎస్ఐ

ల‌వ‌ర్‌పై కాల్పులు జ‌రిపి.. మామ‌ను చంపేసిన ఎస్ఐ

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోరం జ‌రిగింది. ఢిల్లీలోని ల‌హోరి గేట్ పోలీసు స్టేష‌న్ ఎస్ఐ సందీప్ దాహియా.. త‌న ప్రియురాలిపై కాల్పులు జ‌రిపి.. అనంత‌రం పిల్ల‌నిచ్చిన మామ‌ను చంపేశాడు. ఢిల్లీ అలీపూర్ ఏరియాలో ఆదివారం రాత్రి దాహియా త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌తో క‌లిసి కారులో బ‌య‌ల్దేరాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో.. ఆమెపై స‌ర్వీస్ రివాల్వ‌ర్ తో కాల్పులు జ‌రిపి పారిపోయాడు. అనంత‌రం త‌న భార్య ఇంటికి చేరుకున్న దాహియా.. అక్క‌డ మామ‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌ను చనిపోయాడు. దాహియా గ‌త కొన్నేళ్ల నుంచి త‌న భార్య‌కు దూరంగా ఉంటున్నాడు. కొద్ది కాలం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయి. అంత‌లోనే దాహియాకు మ‌రో యువ‌తి ప‌రిచ‌యం కావ‌డంతో ఆమెతో స‌న్నిహితంగా ఉంటున్నాడు. 

అయితే ఈ కేసులో దాహియా ప‌రారీలో ఉన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గాయ‌ప‌డ్డ బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెప్పారు.


logo