బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 22:34:17

ఢిల్లీ కాంగ్రెస్‌ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఆత్మహత్య

ఢిల్లీ కాంగ్రెస్‌ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఢిల్లీ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని ప్రకాష్ సింగ్ (45) గా గుర్తించామని పేర్కొన్నారు. ప్రకాశ్‌ సింగ్‌ జూలై 17న సాయంత్రం సిబ్బంది క్వార్టర్స్‌లోని తన గదిలోకి వెళ్లి తాళం వేసుకుని ఎంతకూ తీయకపోవడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు తలుపులు పగులగొట్టి చూడగా ప్రకాశ్‌ ఉరేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని ఆర్‌ఎంఎల్ దవాఖాన మార్చురీకి తరలించారు. వైవాహిక జీవితంలో విబేధాల కారణంగా నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సూసై‌డ్‌ నోట్‌లో రాశాడు. ఘటనా స్థలంలో దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్య, పిల్లలతో విడిపోయి నిరాశతో ఉన్నందున మద్యానికి బానిసై నైరాశ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.


logo