బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 30, 2020 , 10:52:19

త‌ల్లితో వివాహేత‌ర సంబంధం.. కొడుకును చంపేశాడు..

త‌ల్లితో వివాహేత‌ర సంబంధం.. కొడుకును చంపేశాడు..

న్యూఢిల్లీ : వివాహేత‌ర సంబంధం ఓ నిండు ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. ఈ దారుణ ఘ‌ట‌న ఢిల్లీలోని నిహాల్ విహార్ ఏరియాలో ఈ నెల 22న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ మ‌హిళ భ‌ర్త కొన్నేళ్ల క్రితం చ‌నిపోయాడు. ఆమెకు 15 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. త‌ల్లీకొడుకు క‌లిసి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. అయితే ఆమెకు ప్ర‌దీప్ సింగ్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ విష‌యం ప్ర‌దీప్ కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌డంతో.. వారు ఆ మ‌హిళ‌ను మంద‌లించారు. కానీ ప్ర‌దీప్ మాత్రం ఆమెను వ‌దిలిపెట్ట‌లేదు. 

విడాకులు తీసుకో..

ప్ర‌దీప్ సింగ్ త‌న భార్య‌తో విడాకులు తీసుకోవాల‌ని ఈ మ‌హిళ ఒత్తిడి చేసింది. కానీ ప్ర‌దీప్ ఆమె మాట‌ల‌ను ప‌ట్టించుకోలేదు. త‌న భార్య‌తో విడాకులు తీసుకోను.. కానీ నువ్వు త‌నతో సంబంధం కొన‌సాగించాల‌ని ప్ర‌దీప్ ఆదేశించాడు. ప్ర‌దీప్ కుటుంబం నుంచి బెదిరింపులు రావ‌డంతో అత‌న్ని దూరం పెట్టి, మ‌రో వ్య‌క్తికి ద‌గ్గ‌రైంది. మూడు నెల‌ల క్రితం ఆమె మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. 

ప‌గ పెంచుకున్న ప్ర‌దీప్‌

మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డంతో ఆమెపై ప్ర‌దీప్ ప‌గ పెంచుకున్నాడు. మ‌రో ముగ్గురితో క‌లిసి ఆమె కుమారుడిని డిసెంబ‌ర్ 22న కిడ్నాప్ చేశారు. రూ. 50 ల‌క్ష‌లు తీసుకువ‌స్తే కుమారుడిని విడిచి పెడుతామ‌ని ప్ర‌దీప్ గ్యాంగ్ ఆమెను హెచ్చ‌రించింది. దీంతో బాధిత మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్ర‌దీప్ గ్యాంగ్ ఫ‌రీదాబాద్ నుంచి ఫోన్ కాల్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అక్క‌డికి వెళ్లి చూడ‌గా ఆ అబ్బాయి హ‌త్య‌కు గురయ్యాడు. ప్ర‌దీప్ గ్యాంగ్‌లోని ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌దీప్ మాత్రం ప‌రారీలో ఉన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo