ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 10, 2020 , 10:16:42

కోరిక తీర్చ‌లేద‌ని.. ఉద్యోగం నుంచి తొల‌గించారు

కోరిక తీర్చ‌లేద‌ని.. ఉద్యోగం నుంచి తొల‌గించారు

న్యూఢిల్లీ : కోరిక తీర్చ‌మ‌ని ఓ మ‌హిళా ఉద్యోగినిని వేధించారు.. ఆమె అందుకు ఒప్పుకోలేదు.. త‌మ కోరిక‌ను నెర‌వేర్చ‌నందుకు అకార‌ణంగా ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీ ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది. 

ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఓ ప్ర‌యివేటు లాంజ్ లో గ‌త కొంత‌కాలం నుంచి ఓ మ‌హిళ‌(26) ఉద్యోగం చేస్తోంది. అక్క‌డ డ్యూటీ మేనేజ‌ర్ తో పాటు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ క‌లిసి.. మ‌హిళా ఉద్యోగినిని లైంగిక వేధింపుల‌కు గురి చేశారు. త‌మ కోరిక తీర్చాల‌ని ఒత్తిడి తెచ్చారు. కానీ ఆమె మేనేజ‌ర్ల ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది. గ‌త ఆరు నెల‌ల నుంచి ఆ ఉద్యోగినిని ఏదో ర‌కంగా హింసిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆమె త‌న వ‌స్ర్తాలు మార్చుకుంటున్న స‌మ‌యంలో.. ఆ గ‌దిలోకి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వెళ్లాడు. ఆమెపై అఘాయిత్యం చేసేందుకు య‌త్నించ‌గా ప్ర‌తిఘ‌టించింది. జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ను ఇంప్రెస్ చేయ‌డంలో ఓ బంగారు అవ‌కాశాన్ని కోల్పోయావ‌ని ఆమెతో డ్యూటీ మేనేజ‌ర్ అన్నాడు. 

ఇలా వారి వేధింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు ఉద్యోగిని.. మేనేజ‌ర్ల ప్ర‌తిపాద‌నను తిర‌స్క‌రించ‌డంతో.. మంగ‌ళ‌వారం ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో గురువారం ఢిల్లీ పోలీసుల‌కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ తో పాటు డ్యూటీ మేనేజ‌ర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 


logo