ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 18:59:13

నన్నే ఓడిస్తావా? అని.. మర్డర్ చేసిన బాలుడు

నన్నే ఓడిస్తావా? అని.. మర్డర్ చేసిన బాలుడు

ఇండోర్ : ఆన్ లైన్ గేమ్ లో ప్రతి రోజు తనను ఓడించడం సహించలేని ఓ బాలుడు మరో బాలికను దారుణంగా హత్యచేశాడు. ఇంటికి సమీపంలోని పొలం వద్దకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపి తన కోపం తీర్చుకున్న ఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగింది. 

పక్కపక్క ఇండ్లలో ఉండే 11 ఏండ్ల బాలుడు, 9 ఏండ్ల బాలిక ప్రతిరోజు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే ప్రతిసారి తనను ఓడించడాన్ని జీర్ణించుకోలేని బాలుడు.. బాలికపై కోపం పెంచుకున్నాడు. ఓరోజు ఇంట్లో ఎవరూ లేనిది చూసి బాలికను ఇంటికి సమీపంలోని పొలం వద్దకు తీసుకెళ్లాడు. రోజు నన్ను ఓడిస్తావా.. నిన్నేం చేస్తానో చూడు.. అంటూ బాలికపై రాళ్లతో విరుచుకుపడ్డాడు. దాంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అనంతరం భయపడిపోయి ఇంట్లోని వాష్రూంలో గంటల తరబడి లాక్ చేసుకుని ఉండిపోయాడు. బాలిక కనిపించకపోవడంతో వెతుకుతున్న కుటుంబసభ్యులకు.. ఇంటికి సమీపంలోని పొలం వద్ద విగతజీవిగా కనిపించింది. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి కుటుంబాన్ని విచారించగా.. కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు. అయితే సదరు బాలుడు వాష్రూంలో దాక్కున్నాడని  కుటుంబ సభ్యుల్లో ఒకరు వచ్చి చెప్పడంతో బుజ్జగించి బాలుడిని బయటకు రప్పించారు. తనను నిత్యం ఆన్ లైన్ గేమ్స్ లో ఓడించడంతో కోపం పట్టలేక రాళ్లతో కొట్టానని బాలుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 


logo