శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 11:31:25

బంగ్లాదేశ్‌ మసీదులో పేలుడు.. 21కి పెరిగిన మృతులు

బంగ్లాదేశ్‌ మసీదులో పేలుడు.. 21కి పెరిగిన మృతులు

ఢాకా : బంగ్లాదేశ్‌ నారాయణగంజ్ నగర్‌ మసీదు వద్ద భూగర్భ గ్యాస్ పైపులైన్‌ లీకై జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 21 పెరిగింది. మృతుల్లో 7 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. మసీదులోని ఎయిర్ కండీషనర్లలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి అవి పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని నారాయణగంజ్ ఫైర్ సర్వీస్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ అరేఫిన్ తెలిపారు.

శుక్రవారం సాయంత్రం బైటస్ సలా జేమ్ మసీదులో నమాజ్‌కు వచ్చిన వారితో ఈ ప్రాంతం జనసందోహంగా మారడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. తీవ్రంగా గాయపడిన 17 మంది ఢాకాలోని షేక్ హసీనా నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై స్థానిక అగ్నిమాపక విభాగం, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo