శనివారం 11 జూలై 2020
Crime - May 27, 2020 , 16:17:02

వికారాబాద్ లో కొత్తపేట దంపతుల మృతి

వికారాబాద్ లో కొత్తపేట దంపతుల మృతి

హైదరాబాద్ : మేనకోడలు ఎంగేజ్మెంట్  కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆనంద్ దంపతులు హైదరాబాదులో  మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నారు. కాగా, ఆనంద్ మేనకోడలు ఎంగేజ్మెంట్ కోసం వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి  భార్యభర్తలిద్దరు బైక్ పై వెళ్తున్నారు. వారి బైక్ ను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


logo