బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 17:11:08

అత్త‌ను చంపిన కోడ‌లి తల్లిదండ్రులు

అత్త‌ను  చంపిన కోడ‌లి తల్లిదండ్రులు

కోల్‌క‌తా : కోడ‌లిని హింసిస్తున్న ఓ అత్త‌ను ఆమె త‌ల్లిదండ్రులు దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చి బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో శుక్ర‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. మ‌లినా మోండ‌ల్‌, బ‌సు దేవ్ దంప‌తుల‌కు సుజాత అనే కుమార్తె ఉంది. మ‌లినా దంత‌పులు కూరుగాయ‌లు అమ్ముతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. సుజాత‌ను కోల్‌క‌తాలోని హ‌రిదేవ్‌పూర్‌కు చెందిన సుజ‌మ‌నీ గ‌యేన్‌(60) కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే గ‌యేన్ త‌న కోడ‌లు సుజాత‌ను గ‌త కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలో గ‌యేన్‌ను మ‌ట్టుబెడితే త‌న బిడ్డ‌కు ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు ఉండ‌వ‌ని మ‌లినా, బ‌సుదేవ్ ఆలోచించారు. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. గ‌యేన్‌ను ఇంటికి పిలిచి హ‌త్య చేశారు. 

ఎవ‌రికీ అనుమానం రాకుండా పాడైన కూర‌గాయ‌ల సంచుల్లో గయేన్ మృత‌దేహాన్ని చుట్టిపెట్టారు. కూర‌గాయల కోసం రోజు ఉప‌యోగించే ట్యాక్సీని తీసుకుని మృత‌దేహాన్ని నిర్మానుష్య ప్ర‌దేశంలో ప‌డేసేందుకు బ‌య‌ల్దేరారు. ట్యాక్సీ వేగంగా వెళ్తుండ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి ఆపారు. దీంతో అస‌లు విష‌యం వెలుగు చూసింది గ‌యేన్ మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ‌లినా దంప‌తుల‌తో పాటు మ‌రో వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


logo