గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 19, 2020 , 13:38:51

మామ మందలించాడని కోడలు..భయంతో మామ ఆత్మహత్య

మామ మందలించాడని కోడలు..భయంతో మామ ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా : మామ, కోడలు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జిల్లాలోని మోటకొండూర్ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ నర్సయ్య, ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసల మారయ్య (58), మానస (25) మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మారయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జోసెఫ్ పెద్దపెల్లి జిల్లాకు చెందిన మానసను నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు.

కాగా, చిన్న కుమారుడు లివింగ్ స్టాన్ మానస సొంత చెల్లెలు రీచాను సోమవారం వివాహం చేసుకొని మంగళవారం రాత్రి మోటకొండూర్ లోని ఇంటికి వచ్చారు. దీంతో మారయ్య క్షణికావేశంలో కోడలు మానసను, కుమారుడు జోసెఫ్ ను మందలించాడు. మనస్తాపానికి గురైన మానస ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. భర్త జోసెఫ్ ఆమెను స్థానిక ప్రైవేట్ దవాఖానకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మానస మృతి చెందిందని తెలుసుకున్న మారయ్య భయంతో ఇంటి పక్కనే ఉన్న పశువుల కొట్టంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
logo