ఆదివారం 29 నవంబర్ 2020
Crime - Oct 27, 2020 , 11:33:40

కోడ‌లిని చంపిన అత్త‌, ఆడ‌ప‌డుచులు

కోడ‌లిని చంపిన అత్త‌, ఆడ‌ప‌డుచులు

మెద‌క్ : ఓ కోడ‌లిని అత్త‌, ఆడ‌ప‌డుచులు హింసించి గొంతు నులిమి చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలోని రామాయంపేట మండ‌లం డి ధ‌ర్మారం గ్రామంలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకుంది. మ‌మ‌త‌(25) అనే మ‌హిళ‌కు కొన్నేళ్ల క్రిత వివాహ‌మైంది. అయితే ఆమెను అత్తింటి వారు వేధించ‌డం మొద‌లుపెట్టారు. సోమ‌వారం రాత్రి మ‌మ‌త‌ను ఆమె అత్త‌, ఆడ‌ప‌డుచులు క‌లిసి హ‌త్య చేశారు. ఈ విష‌యం మంగ‌ళ‌వారం ఉద‌యం గ్రామ‌స్తుల‌కు తెలియ‌డంతో.. మ‌మ‌త అత్త, ఆడ‌ప‌డుచుల‌పై దాడి చేశారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.