గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 15, 2020 , 22:11:20

రూ.2 లక్షలకే కోటిన్నర మంది డేటా అమ్ముకున్న హ్యాకర్

రూ.2 లక్షలకే కోటిన్నర మంది డేటా అమ్ముకున్న హ్యాకర్

శాన్ ఫ్రాన్సిస్కో : లాస్ వెగాస్‌లోని ఎంజీఎం రిసార్ట్స్ హోటల్‌లో డార్క్ వెబ్‌లోని 14.2 మిలియన్లకు పైగా అతిథుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు సుమారు 2.18 లక్షలకు అమ్ముకున్నారు. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డేటా దొంగతనాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ డేటాలో ట్విట్టర్ సీఈవోతోపాటు పాప్ స్టార్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ హ్యాకింగ్ గురించి సమాచారం వెల్లడైంది. 2019 లో యూఎస్‌లోని క్యాసినో క్యాపిటల్‌లోని ఎంజీఎం హోటళ్లలో బస చేసిన టెక్ సీఈవోల వంటి ప్రముఖుల వ్యక్తిగత సమాచారంతోపాటు పలువురు ఉన్నతోద్యోగులు, అంతర్జాతీయ పాత్రికేయులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

జెడ్ డీ నెట్ నివేదిక ప్రకారం.. ఎంజీఎం హోటల్ లో 14 కోట్ల 24 లక్షల 79 వేల 937 మంది అతిథుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ కేవలం 2,900 డాలర్లకే విక్రయించాడు. కాగా, డేటా బ్రీచ్ గురించి తమకు తెలుసునని ఎంజీఎం రిపోర్ట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ, పాప్-స్టార్ జస్టిన్ బీబర్ తోపాటు పలువురు ప్రముఖుల వ్యక్తిగత వివరాలతోపాటు ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్లు డేటాలో ఉన్నట్టు సమాచారం.  

ఎంజీఎం రిసార్ట్స్ హోటళ్లలో లాస్ వెగాస్‌లోని బెల్లాజియో, అరియా, ఎంజీఎం గ్రాండ్, మాండెల్లె బే, పార్క్ ఎంజీఎం, మిరాజ్, లక్సోర్, ఎక్సాలిబర్ ఉన్నాయి. గత ఏడాది సర్వర్ ఎక్స్‌పోజర్‌పై అంతర్గత దర్యాప్తు జరిపేందుకు ఎంజీఎం రిసార్ట్స్ రెండు సైబర్ సెక్యూరిటీ ఫోరెన్సిక్ సంస్థలను నియమించింది.


logo