తుపాకీ గురిపెట్టి దళిత మహిళపై గ్యాంగ్‌రేప్.. యూపీలో ఘటన

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ (22)పై తుపాకీ గురిపెట్టి, మాజీ గ్రామపెద్దతో సహా ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేశారు. ‘వారం క్రితం ఘటన చోటుచేసుకుంది. కానీ ఆదివారం బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు’ అని జిల్లా ఎస్పీ కేశవ్ కుమార్ చౌధరి చెప్పారు. ఆ మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు నిందితులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బాదితురాలిని నిందితులు బెదిరించారు. ఈ ఘటనపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఎస్సీ-ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం-1989 ప్రకారం కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం మూడు బృందాలను ఏర్పాటుచేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా రాఫెల్ విన్యాసాలు
- శ్వేతసౌధానికి ట్రంప్ వీడ్కోలు
- ముక్రా (కే)లో జయశంకర్ యూనివర్సిటీ విద్యార్థులు
- మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైరల్
- అధికారంలోకి రాకముందే చైనా, పాక్‌లకు అమెరికా హెచ్చరికలు
- బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'