శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 28, 2021 , 10:29:21

త‌మిళ‌నాడులో దొంగ‌ల బీభ‌త్సం : 17 కేజీల బంగారం చోరీ

త‌మిళ‌నాడులో దొంగ‌ల బీభ‌త్సం : 17 కేజీల బంగారం చోరీ

చెన్నై : త‌మిళ‌నాడులో దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. మైల‌దుతురాయిలో నివాస‌ముంటున్న ఓ బంగారం య‌జ‌మాని ఇంట్లోకి ముగ్గురు దొంగ‌లు మ‌ర‌ణాయుధాల‌తో బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ ప్ర‌వేశించారు. ఇంట్లో ఉన్న న‌లుగురిపై క‌త్తుల‌తో దాడి చేసి 17 కేజీల బంగారాన్ని దొంగిలించారు. ఈ దాడిలో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  

అయితే దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు కుటుంబ స‌భ్యులు ప్ర‌య‌త్నించారు. దీంతో రెచ్చిపోయిన దొంగ‌లు వారిపై క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ దాడుల్లో బంగారం య‌జ‌మాని ధ‌న్‌రాజ్ భార్య ఆశ‌(45), కుమారుడు అఖిల్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అనంత‌రం 17 కేజీల బంగారాన్ని దొంగిలించారు. ఆ ముఠా అక్క‌డ్నుంచి పారిపోతూ సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్‌ను అప‌హ‌రించారు. ధ‌న్‌రాజ్ కారులోనే ప‌రారీ అయ్యారు. 

గంట‌ల వ్య‌వ‌ధిలోనే దొంగ‌లు అరెస్ట్‌

స‌మాచారం అందుకున్న మైల‌దుతురాయి పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. బంగారం య‌జ‌మానిని ధ‌న్‌రాజ్ చౌద‌రిగా పోలీసులు గుర్తించారు. నిందితుల‌ను మ‌ణిపాల్‌, మ‌నీష్‌, ర‌మేశ్‌గా గుర్తించారు. అయితే దొంగ‌లు హిందీలో మాట్లాడిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు దొంగ‌ల‌ను స‌మీప గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు గ‌న్స్‌, బంగారంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.  

VIDEOS

logo