గురువారం 25 ఫిబ్రవరి 2021
Crime - Jan 23, 2021 , 17:03:01

25 కిలోల బంగారం జ‌ప్తు, 7గురి అరెస్ట్‌

25 కిలోల బంగారం జ‌ప్తు, 7గురి అరెస్ట్‌

హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులోని హోసూరులో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ‌లో జ‌రిగిన బంగారం ఆభ‌ర‌ణాల చోరీ మిస్ట‌రీని సైబ‌రాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా బంగారం ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ శ‌నివారం మీడియాకు తెలిపారు. 

ఈ ముఠా తెలంగాణ మీదుగా నాగ్‌పూర్ పారిపోయేందుకు ప్ర‌య‌త్నించిందని స‌జ్జ‌నార్ వెల్ల‌డించా‌రు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తులు ఈ ముఠాలో ఉన్నార‌ని చెప్పారు. ఈ దొంగ‌ల ముఠాను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేక పోలీసు బృందాలను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశామ‌ని వివ‌రించారు. దొంగిలించిన బంగారాన్ని త‌ర‌లించేందుకు ఉప‌యోగించిన లారీ, కంటైన‌ర్‌, సుమోల‌ను సీజ్ చేశామ‌ని తెలిపారు. 

వారి వ‌ద్ద నుంచి 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ‌ని స‌జ్జ‌నార్ అన్నారు. ఈ ముఠా ఆచూకీని క‌నిపెట్టేందుకు టోల్‌ప్లాజాల వ‌ద్ద క్షుణ్ణంగా త‌నిఖీలు చేశామ‌ని చెప్పారు. వారి వ‌ద్ద నుంచి 25 కిలోల బంగారం, రూ.93 వేల న‌గ‌దు జ‌ప్తు చేశామ‌ని వివ‌రించారు. ఏడు తుపాకులు, ఇత‌ర మందుగుండు సామ‌గ్రిని స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు. పెద్ద‌పెద్ద షాపుల్లో వాటి యాజ‌మాన్యాలు సీసీటీవీ కెమెరా నెట్‌వ‌ర్క్‌తోపాటు అలారం వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo