సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 15:44:23

సైబ‌రాబాద్‌లో అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్ట్

సైబ‌రాబాద్‌లో అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్ట్

హైద‌రాబాద్‌: ప‌దిమంది స‌భ్యుల అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠాను సైబాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ముఠా స‌భ్యుల‌ను సైబరాబాద్ సీపీ స‌జ్జ‌న్నార్ మీడియా ముందు హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ముఠా స‌భ్యుల‌పై ఇప్ప‌టికే ప‌లు కేసులున్నాయ‌ని చెప్పారు. న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్టలోని అంబేద్క‌ర్ కాల‌నీలో దొంగ‌లు షెల్ట‌ర్ తీసుకున్నార‌ని వెల్ల‌డించారు.  

ముఠా స‌భ్యులు దొంగ‌త‌నాల్లో ఆరితేరార‌ని చెప్పారు. చోరీకి పాల్ప‌డే ప్రాంతాన్ని ముందే క్షుణ్ణంగా ప‌రిశీలిస్తార‌ని చెప్పారు. నేరం చేసే ప్ర‌య‌త్నంలో ఆయుధాలు ఉప‌యోగిస్తార‌ని, చోరీ స‌మ‌యంలో అడ్డువ‌చ్చేవారిని చంపేందుకైనా వెనుకాడ‌ర‌ని అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల్లో వీరు నేరాల‌కు పాల్ప‌డ్డార‌ని, వాటిపై ఇంకా విచారించాల్సి ఉన్న‌ద‌ని చెప్పారు. వారి నుంచి ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు.  



logo