బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 07:43:09

రూ.10 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

రూ.10 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు. మనకు తెలియకుండానే మన అకౌంట్‌ను నుంచి డబ్బును మాయం చేస్తున్నారు. తాజగా ఆన్‌లైన్‌లో వస్తువుల పేరుతో దాదాపు రూ.10 లక్షలు కాజేశారు. హైదరాబాద్ బేగంపేటకి చెందిన మహమ్మద్ యాసిన్ అహ్మద్ ఆన్లైన్‌లో కన్స్ట్రక్షన్ గ్లౌస్‌లను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన అనంతరం తనకు తెలియకుండానే తన అకౌంట్ నుంచి రూ.6.88 లక్షలు మాయమయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన అహ్మద్‌ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉంటే మరోవైపు తనను తెలియకుండానే తన అకౌంట్ నుంచి రూ.3.88 లక్షలు కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని లకిడికపూల్‌కి చెందిన రజిని అనే మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo