ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 13:38:25

బాలిక‌పై సీఆర్పీఎఫ్ జ‌వాను అత్యాచారం

బాలిక‌పై సీఆర్పీఎఫ్ జ‌వాను అత్యాచారం

రాయ్‌పూర్ : ప‌్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన జ‌వానే దారుణానికి పాల్ప‌డ్డాడు. ఓ బాలిక‌పై అత్యాచారం చేశాడు జ‌వాన్. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుక్మా జిల్లాలోని దోర్న‌పాల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గురువారం చోటు చేసుకుంది. 

గిరిజ‌న గ్రామానికి చెందిన ఓ బాలిక‌.. ప‌శువుల‌ను మేపేందుకు సోమ‌వారం ఉద‌యం అట‌వీ ప్రాంతానికి వెళ్లింది. ఆ ఏరియాలో ఉన్న సీఆర్పీఎఫ్ జ‌వాన్ ఆ బాలిక‌పై అత్యాచారం చేశాడు. ఆ రోజు త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌లేదు. మ‌రుస‌టి రోజు త‌నకు జ‌రిగిన ఘోర అవ‌మానంపై బాలిక పెద‌వి విప్పింది. సీఆర్పీఎఫ్ జ‌వాను త‌న‌ను అత్యాచారం చేశాడ‌ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబం దోర్న‌పాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

బాలిక‌పై అత్యాచారం చేసిన జవాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదివాసీ మ‌హాస‌భ కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు.


logo