మంగళవారం 24 నవంబర్ 2020
Crime - Oct 26, 2020 , 21:30:22

పాక్‌ రాయబార కార్యాలయం వద్ద జవాన్‌ ఆత్మహత్యాయత్నం

పాక్‌ రాయబార కార్యాలయం వద్ద జవాన్‌ ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాన్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి జవాన్లు అతడ్ని వెంటనే ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. సీఆర్పీఎఫ్‌కు చెందిన డీ రాంబాబు ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం బయట విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అతడు ఒక్కసారిగా తన వద్ద ఉన్న సర్వీస్‌ తుపాకీతో తనపైనే కాల్పులు జరుపుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రాంబాబును తోటి జవాన్లు వెంటనే ఎయిమ్స్‌ దవాఖానకు తరలించారు. ఢిల్లీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి ఈ విషయం తెలుసుకున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.