శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 13:20:30

భార్యను కాల్చి చంపి తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌..

భార్యను కాల్చి చంపి తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌..

జమ్ము : జమ్ముకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ భార్యను సర్వీస్‌ రైఫిల్‌తో కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూలోని సెక్టార్ ప్రధాన కార్యాలయంలో కానిస్టేబుల్ మదన్ సింగ్ (38) విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి శిబిరం నుంచి వచ్చిన ఆయన ఘరోటా రాగోర్ ప్రాంతంలోని బావ ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న భార్య దీప్తి రాణి (35)తో గొడవ పడి బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వచ్చి ఇంటి తలుపు తట్టాడు. తలుపులు తీసేందుకు వచ్చిన భార్యపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల్లో భార్య సోదరి సైతం గాయపడింది. అనంతరం భార్య మృతదేహం వద్దే తానూ కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సీఆర్‌సీఆఫ్‌ శాఖపరమైన విచారణకు ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo